శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ఖమ్మం జిల్లాలోని ఇల్లందు క్రాస్ వద్ద గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విషాదం నెలకొంది.  ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న యోగానందిని (16)  శుక్రవారం తెల్లవారుజామున గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం స్టడీ ఆవర్ కు హాజరైన తర్వాత ఆమె గదిలోకి వెళ్లి ఈఆఘాయిత్యానికి పాల్పడింది. ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మృతురాలి స్వస్థలం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.