Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 4:33 pm Posted by : ramakrishna

ఇష్టంలేని చదువుతో విద్యార్ధిని బలవన్మరణం

  • కంట తడిపెట్టిస్తున్న సూసైడ్ నోట్
  • ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య

 

వెబ్ న్యూస్, బతుకమ్మ : నాకు చదువు అర్థం ఐతలే.. మీకు చేబితే మీరు అర్థం చేసుకుంటలే… నాకు మొత్తం టెన్షన్ ఐతుంది. మైండ్ పోతుంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే, నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకుంటలే చివరకు నాకు చావే దిక్కయింది… అంటు ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది…

హనుమకొండ జిల్లా కేంద్రంలోని  నయీమ్ నగర్ ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల కు చెందిన మిట్టపల్లి శివాని (16) సీనియర్ ఇంటర్ విద్యార్థిని అత్మహత్యకు పాల్పడింది. కాగా విద్యార్థిని కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజిఎంకు మార్చురీకి తరలించడం పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఇలావుంటే మృతురాలు రాసిన సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో లభ్యమైంది. కళాశాలలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఆ లేఖలో శివాని తన ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని కోర్సులో చేర్పించడం వలన తక్కువ మార్కులు వచ్చాయని అందులో పేర్కోంది. తల్లిదండ్రులు ఫీజు కట్టడం వలననే చదివానని, తనకు అంత తక్కువ మార్కులు రావడం తట్టుకోలేకున్నానని అందులో రాసింది.

Student commits suicide due to unwanted studies