- తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ గురుకులంలో ఘటన
- ట్రిమ్స్ అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నిరసన
వర్ని, బతుకమ్మ : తెలంగాణ మైనార్టి గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం గన్ పూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న షేక్ గౌస్ (14) సంవత్సరాలు వసతి గృహంలోని గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ టి.నరేష్ కుమార్, వార్డెన్ ముజాహిల్ తెలిపారు. వారి కథనం ప్రకారం… నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ కు కాలానికి చెందిన షేక్ హమీద్ కుమారుడు షేక్ ముసా ను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు గన్ పూర్ ట్రిమ్స్ వసతి గృహంలో చేర్పించినట్టు పేర్కొన్నారు. పోయిన శుక్రవారం తనకు చాతి నొప్పి ఉందని అదే విధంగా బర్త్ సర్టిఫికెట్ తేవాలని మృతుడు విద్యార్థి గౌస్ ఇంటికి వెళ్ళినట్టు తెలిపారు. ఇంటికి వెళ్లిన విద్యార్థి ఆదివారం నాడు తన సోదరుడు సహకారంతో హాస్టల్ కు రావడం జరిగిందని అన్నారు. ఆదివారం సాయంత్రం స్టడీ క్లాసులు ముగిసిన తర్వాత విద్యార్థులు తమ రూమ్ కి వెళ్లడం జరిగిందని అన్నారు. రూమ్ లో ఉన్న విద్యార్థుల గదిలోకి సిబ్బంది రాత్రి 11 గంటల వరకు రౌండ్స్ వేసి మాట్లాడడం జరిగిందని అన్నారు. సోమవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో విద్యార్థి గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయినట్టు పేర్కొన్నారు. ఈ విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకొని వారి బంధువులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఐదు గంటల 30 నిమిషాల ప్రాంతంలో రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి హమీద్ కు వివరణ కోరగా ఇంట్లో కూడా ఏమీ గొడవ జరగలేదని ఎప్పుడు వెళ్లినట్టే హాస్టల్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు.తన కొడుకు ఏ విధంగా చనిపోయాడో ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తామని అన్నారు.పోలీసుల తమకు న్యాయం చేయాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరంమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

- వసతి గృహం ఎదుట పోలీసుల భారీ బందోబస్తు..
మైనార్టీ వెల్ఫేర్ వసతి గృహం ఎదుట రుద్రూర్ సీఐ కృష్ణఎస్సై సాయన్న తోపాటు పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, వార్డెన్ ముజాహిల్ లను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.విద్యార్థి ఆత్మహత్య విషయం తెలసుకున్నవిద్యార్థి సంఘాలుభారీ సంఖ్యలో తరలివచ్చి గేటు బయట ఆందోళన నిర్వహించారుమృతి కి గల కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థి సంఘ నాయకులు లోపటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయగా పోలీసులు వారిని గేట్ వద్ధనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులకు పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకోవడానికి తమకు లోనికి వెళ్ళనీయకపోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 60సీసీ కెమెరాలు పనిచేస్తలేవని వార్డెన్ అనడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క సీసీ కెమెరా ఎలా పనిచేయదని సీసీ కెమెరా లేకుండా వసతి గృహాన్ని ఎలా నడిపిస్తున్నారని వార్డెన్ తీరుపై పోలీసు తీరుపై విద్యార్థి సంఘం నాయకులు మంది పడ్డారు. నిన్నటి వరకు సీసీ కెమెరాలు అనగా మొత్తం 60సీసీ కెమెరాలు పని చేస్తే విద్యార్థి మృతి చెందిన తర్వాత సీసీ కెమెరా పనిచేయకపోవడం ఏమిటని వార్డెన్ నిడదీశారు. జిల్లా కలెక్టర్ లేక బోధన్ సబ్ కలెక్టర్ ఇక్కడికి వచ్చి విద్యార్థి మృతికి కారణాలు తెలపాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరికలు చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
