Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:57 pm Posted by : ramakrishna

యోగాలో విద్యార్థి ఆదిత్యకు సిల్వర్ మెడల్

ఇందూర్, బతుకమ్మ :

 

యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో నందిపేట్ లోని ఉజ్వల స్కూల్లో ఈనెల 1న నిజామాబాద్ జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కాకతీయ ఒలంపిక్స్ సుభాష్ నగర్ 7వ తరగతి విద్యార్థి పడకంటి ఆదిత్య 10-12 సంవత్సరాల వయస్సు గల కేటగిరి లో ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకున్నా ఆరోగ్యరక్ష యోగా సెంటర్ డా.ఐశ్వర్య ఆధ్వర్యంలో కేవలం రెండు గంటల్లో ప్రాక్టీస్ చేసి మొదటి సారి యోగా పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించటం పట్ల కాకతీయ స్కూల్ యాజమాన్యం, ఆరోగ్యరక్ష ఐశ్వర్య, ఆదిత్య తల్లితండ్రులు డా. రాము సాత్విక సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉప ప్రధానోపాధ్యాయురాలు భావన ఠాకూర్, యోగా కోచ్ గంగాధర్ లు అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబరిచి పథకాలు సాధించాలని కొనియాడారు.