జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్దం కావాలి
సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి సంఘానికి సభ్యత్వమే కీలకం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్దం కావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మరిన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని,ఈ విషయంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సమస్యలపై పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం సిద్దం కావాలని సూచించారు....