అక్రమ అరెస్టులతో పోరాటాలను అణిచివేయలేరు

సిరికొండ, బతుకమ్మ: గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా సీపీఐ(ఎంఎల్), టీఎస్ యూఐ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం తగదని, అక్రమ అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరని సీపీఐ(ఎంఎల్) రాష్ర్ట నాయకుడు పిట్ల రామకృష్ణ అన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ జేఏసీ పిలుపు మేరకు నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా సిరికొండ పోలీసులు సీపీఐ(ఎం ఎల్ ), టీఎస్ యూఐ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన...