సిరికొండ, బతుకమ్మ: సమస్యల పరిష్కారం కోసం రైతాంగానికి పోరాటమే ఏకైక మార్గమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) పిలుపుమేరకు హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సిరికొండ మండలానికి చెందిన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, ఏఐయూకేఎస్ నాయకులు గురువారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఏళ్లుగా ఢిల్లీ కేంద్రంగా రైతులు పోరాడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రైతు సంక్షేమాన్ని కార్పొరేట్లకు కుదవపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
ధర్నాకు తరలి వెళ్లిన వారిలో సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేశ్, నాయకులు ఎస్ సురేశ్, పి. ప్రకాశ్, డివిజన్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఈ రమేశ్, బాబన్న, బి. కిశోర్, కే. రాంజీ, ఎస్ కిషోర్, ఎండీ అనీస్, జి. బాల్ రెడ్డి, టీ భూమాగౌడ్, జి. ఎర్రన్న, బి గోపి, జి రాజు, కే ఆశిష్, ఏ బాలయ్య తదితరులు ఉన్నారు.