Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 7:05 pm Posted by : ramakrishna

పోరాటం మాకు కొత్త కాదు.. అక్ర‌మ కేసుల‌తో మా గొంతు నొక్క‌లేరు..

  • కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా అక్రమ కేసులు
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, బతుకమ్మ : పోరాటం మాకు కొత్త కాదు… అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరు.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ వేదికగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేశారు.  రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌ ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌నాయిస్తున్న అక్ర‌మ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదని అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోండి.. తాము కేసీఆర్ కు సైనికులం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టిందని పేర్కొన్నారు. మీ చిల్ల‌ర‌ వ్యూహాలు తమని భయపెట్టవని,  అవి తమ సంకల్పానికి మ‌రింత బ‌లం చేకూరుస్తాయని తెలిపారు.

Struggle is not new to us.. We cannot be choked with illegal cases..