బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు హ‌స్తిన‌లో స‌మ‌రం

ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నేడు జంత‌ర్‌మంత‌ర్‌లో ధ‌ర్నా ఢిల్లీ చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయ‌కులు   ఢిల్లీ, బతుకమ్మ:  బీసీ రిజ‌ర్వేష‌న్ల పోరాటం దేశ  రాజ‌ధాని ఢిల్లీ చేరుకుంది. జిత‌నీ ఆబాదీ.. ఇత‌నీ హిస్సేదారి (ఎంత జ‌నాభాకు అంత వాటా) అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచ‌ర‌ణలో పెట్టేందుకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ట్టువీడ‌కుండా  ప్ర‌య‌త్నిస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు- విద్యా, ఉపాధి రంగాల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లుల‌ను పార్ల‌మెంట్‌లో ఆమోదించాల‌ని...