Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 5:01 pm Posted by : ramakrishna

తెలంగాణ వర్సిటికీ న్యాక్ గుర్తింపు కోసం కృషి

డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం కృషి చేస్తానని నూతన వైస్ ఛాన్స్ లర్ టి యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనాభవనంలో సోమవారం వీసీ గా యాదగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.  తెలంగాణ యూనివర్సిటీ  టీచర్స్ అసోసియేషన్, కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్, పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్, అప్లియేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్, నాన్- టీచింగ్ అసోసియేషన్, అవుట్ సోర్సింగ్  అసోసియేషన్ తదితరుల ఆధ్వర్యంలో వీసీని ఘనంగా సన్మానించారు.

Strive for NAAC recognition for Telangana University