ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   బతుకమ్మ,నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ధోబీఘాట్, కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం...