Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2024, 10:15 am Posted by : ramakrishna

రోడ్లపై కురగాయాలు విక్రయిస్తే కఠిన చర్యలు

 కురగాయాల వ్యాపారులకు మార్కేట్ చైర్మెన్ హెచ్చరిక

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

శ్రద్దనంద్ గంజ్ లో గల కూరగాయల హోల్ సెల్ మార్కెట్ లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్ లో ఉన్న షాప్ యజమానులకు ఇచ్చిన షాప్ స్థలం ఉన్నతవరకే కూరగాయల విక్రయాలు జరగాలి షాప్ ముందు ఉన్న రోడ్ పై కూరగాయల విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మార్కెట్ లో ఉన్న సమస్యలను  గురువారం మార్కేట్ కమిటి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మార్కెట్ లో వెహికల్స్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని యూనియన్ ప్రెసిడెంట్ నీ కోరారు.  మార్కేట్ లో పాడైన కురగాయాలను  ఎప్పటికపుడు తోలిగించి పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. చైర్మన్ గంగారెడ్డి తో పాటు సెక్రటరీ డైరెక్టర్లు మల్లేష్ , నరేందర్ మార్కెట్ కమిటీ  సిబ్బంది  ఉన్నారు.