Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 6:35 pm Posted by : ramakrishna

ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు

 

. . . బోధన్‌లో 8 మందికి జైలు శిక్ష

 

బోధన్, బతుకమ్మ :

 

ప్రజా శాంతిని భంగం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌ఓ వి. వెంకటనారాయణ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ఘటనల్లో 8 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఇరువర్గాలు గొడవ పడుతున్న ఆరు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి, వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా, ప్రతి ఒక్కరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. అలాగే గోశాల ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న షైక్ రసూల్‌ను కోర్టులో హాజరుపరచగా, అతనికి రూ.5,000 జరిమానాతో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. అదే ప్రాంతానికి చెందిన అయ్యుబ్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినందుకు కోర్టు రూ.5,000 జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది.