మాడిఫైడ్ సైలెన్సర్లను బిగిస్తే కఠిన చర్యలు
అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శబ్ద కాలుష్యం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లను అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో పట్టుబడిన 350 మాడిఫైడ్ సైలేన్సర్లను సీజ్ చేసి బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్ ముందు అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. మాడిఫైడ్ సైలెన్సర్లను అక్రమంగా బిగించుకున్న వాహనదారులపై చట్ట ప్రకారం...