మాదకద్రవ్యాలు వాడినట్లయితే కఠిన చర్యలు
. . . ఎస్సై సుమలత ఇందల్వాయి, బతుకమ్మ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలను వాడినట్టయితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై సుమలత అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తీర్మాన్ పల్లి గ్రామంలో ఎస్సై సుమలత ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, విద్య, కుటుంబ సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించబడిందన్నారు....