Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:29 pm Posted by : ramakrishna

మాదకద్రవ్యాలు వాడినట్లయితే కఠిన చర్యలు

 

. . . ఎస్సై సుమలత

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలను వాడినట్టయితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై సుమలత అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తీర్మాన్ పల్లి గ్రామంలో ఎస్సై సుమలత ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, విద్య, కుటుంబ సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించబడిందన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “డ్రగ్స్‌ కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించండి” అనే నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యల గురించి వివరించి, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామస్థులు తమ పరిసరాల్లో అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుండి మంచి స్పందన లభించగా, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అందరితో కలిసి యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, జడ్పీహెచ్ ఎస్ పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుచ, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.