బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ, సమిష్టి నిర్ణయం ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అది ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. అయితే అందుకు భిన్నంగా డబ్బుల ప్రలోభాలు చూపి, భయ భ్రాంతులకు గురి చేసి...