. . . జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు
. . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందాలు, పేకాట, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరం వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్ర, నిజామాబాద్ చుట్ట సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలిచ్చినట్లు సీపీ తెలిపారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతామని తెలిపారు.