ఎస్ఐఆర్ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యల కింద బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై కలెక్టర్ శుక్రవారం నగర పాలక సంస్థ సమావేశ...