డీజే బాక్స్ లు పెడితే కఠిన చర్యలు
రుద్రూర్ ఎస్సై సాయన్న రుద్రూర్, బతుకమ్మ: సీపి సాయి చైతన్య ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం రోజున డిజే నిషేదించబడిందన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం డీజే యజమానులు, ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం రోజున డీజే నిషేధించబడిందని, కావున డీజే బాక్సులు పెడితే డిజే బాక్స్ లను సీజ్ చేస్తామని అన్నారు.