రైళ్ళపై రాళ్ల దాడికి పాల్పడితే కఠిన చర్యలు

రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 102మంది అరెస్ట్ రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచిన 33మంది అరెస్ట్   హైదరాబాద్, బతుకమ్మ : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్.పి.ఎఫ్), దక్షిణ మధ్య రైల్వే రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకారక  వస్తువులను ఉంచడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భంగం కలుగుతుంది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి కార్యకలాపాలు క్రిమినల్ నేరం, నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కఠినమైన చర్యలు తీసుకుంటారు, దీనికి...