ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి బతుకమ్మ:బిచ్కుంద : ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో క్రికెట్ బెట్టింగ్స్ జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు విశాఖ లోనూ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రత్యక్షంగా కొన్ని చోట్ల బెట్టింగ్స్ జరుగుతుంటే ఆన్‌లైన్ ద్వారా కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో డబ్బులు పోగొట్టుకుని బాధితులు రోడ్డు పాలవుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ కట్టిన కొందరు నష్టాలు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఉదంతాలు జిల్లాలో ఇప్పటికే కలకలం రేపాయి. దీంతో బెట్టింగ్స్ నిర్వహణపై ...