Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 8:47 pm Posted by : ramakrishna

అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కఠిన చర్యలు

  • ఎస్సై మహేష్ 

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చెప్పడతామని ఎస్సై మహేష్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని నందిగల్లీ ఏరియాలో అనుమతులు లేకుండా,అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొన్నారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ నందిగల్లీ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటు వైపుగా ఇసుక లోడ్ తో వస్తున్న రెండు ట్రాక్టర్లను ఆపి ఇసుక రవానకు సంబందించిన అనుమతి పత్రాలను అడగగా వారు ఎలాంటి పత్రాలు చూపలేదని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న డ్రైవర్లు వేముల అన్వేష్, గంగరపు దేవేందర్ల పై, రెండు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.