Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 6:16 pm Posted by : ramakrishna

ఆవు దూడలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

బతుకమ్మ, భిక్కనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, లేక దూడలను గాని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. గురువారం టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర బొలెరోలో అక్రమ రవాణా జరుగుతున్న 11 ఆవు దూడలను  ఎలాంటి అనుమతులు లేకుండా మరియు పరిమితికి మించి ఎక్కువ లేక దూడలను తరలిస్తున్న వాహనంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఆవు దూడలను గోశాలకు తరలించడం జరిగిందన్నారు. నిత్యం చెక్ పోస్ట్ వద్ద పశువైద్యాధికారులు పర్యవేక్షణలో 24 గంటలు పోలీసులు అక్రమ రవాణాపై నిఘ పెడుతూ పశువుల ఆక్రమణలు అరికట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

Strict action will be taken against illegal transportation of cow calves