కాలువలు, చెరువులను ఆక్రమిస్తే కఠినచర్యలు
జిల్లా చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఎల్లయ్య చెరువును పరిశీలించిన అధికారులు బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువును పరిశీలించారు. చెరువు, కుంటలు కబ్జా అవుతుండడంపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో నాయకులు నేరుగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. దీంతో చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ శనివారం చెరువును సందర్శించారు.ఈ సందర్భంగా 49 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువును పలువురు కబ్జా చేస్తుండడాన్ని...