ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

తహశీల్దార్ తారాబాయి   రుద్రూర్, బతుకమ్మ: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని రుద్రూర్ తహశీల్దార్ తారాబాయి అన్నారు. శనివారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 246లో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జాలకు పాల్పడిన విషయం తెలుసుకొని తన సిబ్బందితో అక్బర్ నగర్ గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  సర్వే నంబర్ 246 లోని  స్థలాలలో నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని...