కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

   నాగిరెడ్డిపేట్, బతుకమ్మ :   నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బంధముల నరేష్ పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, జర్నలిస్టు అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంటోళ్ళ యాదయ్య,  నాగిరెడ్డిపేట మండల ఎంఆర్పిఎస్ నాయకులు తొంట సాయిలు, మండల ఉపాధ్యక్షులు యాదగిరి, నాగరాజు తో పాటు నాయకులు  డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు సైతం నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం, అధికారులు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇంకా...