హాస్టల్ సప్లయర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం వస్తువులు సప్లై చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన సప్లయర్ పైన, అవినీతిలో భాగస్వామ్యమైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు హాస్టల్స్ నుండి అడ్మిన్ వరకు శుక్రవారం ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ మెస్ లో నాసిరకమైన వస్తువులు దోరికాయని విద్యార్థుల ఆందోళనతో ఎంక్వయిరీ కమిటీ...