. . . ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఆర్ ఎస్ పి ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో కృత్రిమంగా , నిషేదిత మత్తు పదార్థాలను ఉపయోగించి కృత్రిమ కల్లు విక్రయాలు జరుపుతున్న కల్లు డిపోలో ( సోసైటి)ల ముసుగులో, కల్లు బట్టీల పై చర్యలు తీసుకోవాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ( ఆర్ ఎస్ పి)ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కల్లు దుకాణాలు ,కల్లు డిపోలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ కొన్ని కల్లు డిపోలో అధిక మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నారని ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి డిపోలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, దేవాలయాలు , ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలకు సమీపంలో ఉన్న కల్లు దుకాణాలు వెంటనే తొలగించాలని కోరారు. మద్యం మరియు మత్తు పదార్థాల వినియోగం యువత పై తీవ్ర ప్రభావం చూపుతోందని, సమాజంలో అనేక సామాజిక సమస్యలకు కారణమవుతోంది ఆందోళన వ్యక్తం చేశారు.నిజామాబాద్ నగరాన్ని మత్తు పదార్థాల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిట్ల.నరేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు