నీట్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  హైదరాబాద్, బతుకమ్మ :   ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 24న జరగనున్న విద్యాసంస్థల బంద్‌కు పీడీఎస్‌ఎఫ్, డీఎస్‌ఎఫ్‌ఐ, బీడీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ...