యూరియా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   సిరికొండ, బతుకమ్మ : యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ తీరుతెన్నుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది యూరియా ఎరువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పలువురు స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా, అలాంటివారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు...