Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 12:38 pm Posted by : ramakrishna

రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెడితే కఠిన చర్యలు

 భిక్కనూరు, బతుకమ్మ :

భిక్కనూరు పట్టణంలో రోడ్లపై ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెడితే కఠిన చర్యలు ఉంటాయని భిక్కనూరు ఎస్సై సాయికుమార్ అన్నారు. శనివారం రోడ్లపై పోసిన దాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐ మా ట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాలలోనే వేసి ఆరబెట్టుకోవాలని, జాతీయ రహదారిపై వడ్లు ఆరబెట్టి ప్రజా రవాణాకు భంగం కలిగించకూడదన్నారు. వెంటనే రోడ్డు పైన వేసిన ధాన్యాన్ని తీసివేయాలని,లేని యెడల ధాన్యాన్ని తీసుకొచ్చిన వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Strict action if grain is dried on the road