చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ కద్రోజ్ నాగేంద్ర చారి హెచ్చరించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చైనా మాంజా నిలువ ఉంచిన, తయారుచేసిన, అమ్మిన, అమ్మడానికి ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని తెలిపారు. చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్...