Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 9:03 pm Posted by : ramakrishna

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ కద్రోజ్ నాగేంద్ర చారి హెచ్చరించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చైనా మాంజా నిలువ ఉంచిన, తయారుచేసిన, అమ్మిన, అమ్మడానికి ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని తెలిపారు. చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సూచించారు. విక్రయించిన మాంజా తో ఎదైనా ప్రమాదం జరిగినట్లయితే విక్రయ దారులు కూడా ఆ కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా చైనా మంజా నిలువచేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి 87126 59812 సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని పేర్కొన్నారు.