టొల్ ప్లాజా వద్ధ ఆక్రమంగా తరలిస్తున్న లేగ దూడల పట్టివేత
బతుకమ్మ, భిక్కనూరు :
ఆవులను పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆవులు ,పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి టోల్ ప్లాజా సమీపంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే శనివారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో నిర్మల్ నుండి హైదరాబాద్ వెళుతున్న డీసీఎం మరియు బొలెరో వాహనంలో 16 లేగ దూడలు 25 ఎడ్లు పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందన్నారు. మరోవైపు ఇప్పటికే బక్రీద్ సందర్భంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పోలీసులు హెచ్చరించిన అక్రమార్కులు మాత్రం పట్టించుకోకుండా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవుల అక్రమ రవాణా మాత్రం నిత్యం జరుగుతూనే ఉందని భిక్కనూర్ రామదండు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
