ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
రెవెన్యూ అధికారి సాయిబాబా మద్నూర్, బతుకమ్మ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను డోంగ్లి రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. డోంగ్లి మండలం సిర్పూర్ వద్ద మంజీర నది నుంచి వస్తున్న ట్రాక్టర్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారి సాయిబాబా తెలిపారు. తదుపరి చర్యల కోసం ట్రాక్టర్ను తహశీల్దార్ కార్యాలయానికి తరలించామన్నారు.