Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 6:57 pm Posted by : ramakrishna

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

  • జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్కానింగ్ సెంటర్ లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ హెచ్చరించారు. పీసీ అండ్ పీఎన్డీటీ ఆక్ట్ పైన అదనపకు కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.రాజశ్రీ మాట్లాడారు. జిల్లాలో కొత్తగా మూడు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి, రెండు స్కానింగ్ కేంద్రాలకు రిన్యూవల్, బోధన్ డివిజన్ లోని ఒక స్కానింగ్ కేంద్రాన్ని మూసివేసేందుకు అదనపు కలెక్టర్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీ బ్రుందాలను డివిజన్ స్థాయిలో ఒకటి చొప్పున, జిల్లా కేంద్రంలో అదనంగా ఒకటి మొత్తం నాలుగు బ్రుందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీరు బ్రుందాలుగా జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్ లను తనిఖీ చేస్తారని అన్నారు. ఎవరైనా పీసీపీఎన్ఢీటీ ఆక్ట్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కానింగ్ కేంద్రాలలో తప్పనిసరిగా ఫాం ఎఫ్, రెఫరల్ పద్ధతులను ఖచ్చితంగా తనిఖీ బ్రుందం పరిశీలించాలని ఆదేశించారు. పీసీపీఎన్ఢీటీ ఆక్ట్ కు సంబంధించి ఫెక్సీ బోర్డులో ప్రతి స్కానింగ్ కేంద్రంలో మూడు భాషల్లో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ (సీటీసీ) సయ్యద్ మస్తాన్ వలీ, క్రిష్ణ, న్యాయవాది సయ్యద్ ఇర్షద్ బుకారి, ఎన్జీఓ ఎ.లింబాద్రి, ప్రోగ్రాం అధికారి డా.సుప్రియ పాల్గొన్నారు.

Strict action against gender determination tests