డబుల్ బెడ్ రూమ్ కాలనీలో వెలగని వీధి దీపాలు

నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జెఎన్సీలో గల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు వెలగడం లేదని, విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరిస్తున్నాయని  కాలనీవాసులు వాపోతున్నారు. ఒక్కోసారి పగలు కూడా వెలుగుతూనే ఉంటాయని, వీధి దీపాల పట్ల  గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.