వీధి కుక్కల స్వైర విహారం…
. . . వాహనాల వెంటపడి పరుగుపెట్టిస్తున్న వీధికుక్కలు . . . గాయాలపాలవుతున్న చిన్నారులు, వాహనదారులు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పంచాయతీల్లో, వార్డులల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిన్నారులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో కుక్కలను పట్టి చంపేసేవారు....