Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 7:17 pm Posted by : ramakrishna

ఆర్మూర్ లో వీధి కుక్కల స్వైర విహారం

  • చిన్నారిపై వీధి కుక్కల దాడి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్మూర్ పట్టణ ప్రజలు..

 

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో మున్సిపల్ 11వ వార్డు పరిధిలో జర్మన్ జట్టి కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ కాలనీలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. జమ్మన్ జెట్టి కాలనీలో ఆడుకుంటున్న ఆ చిన్నారి బాలుడి పై విచక్షణారహితంగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ ఐదేళ్ల చిన్నారి బాలుడిని వీధి కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో కుటుంబ సభ్యులు నిజామాబాదులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కొద్ది రోజులకు ఒకసారి వీధి కుక్కలు విచక్షణారహితంగా చిన్నారులపై దాడి చేస్తుండడం పట్ల ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలందరూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కలు ఇస్తా రీతిగా స్వైర విహారం చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని మున్సిపల్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు అసహనం వెలిబుచ్చుతున్నారు.