Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 7:12 pm Posted by : ramakrishna

మండల కేంద్రంలో వీధి కుక్కల దాడి

ఎంపీడీవో కు వినతి
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో కొంతమంది వ్యక్తులపై సోమవారం కుక్కలు దాడి చెసి గాయపర్చాయి. ఈ సందర్బంగా బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో రాజకిరణ్ కు మండలంలో వీధి కుక్కల నియంత్రణకై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణ కోసం గతంలో కూడా ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా ఎంపీడీవో కుక్కల నియంత్రణ కొరకు చర్యలు తీసుకొని కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరారు.

Stray dog ​​attack in mandal centre