వ్యూహాత్మక సమాచారం పాక్ కు చేరవేత

డీఆర్డీవో కాంట్రాక్టు సిబ్బంది అరెస్టు వెబ్ న్యూస్, బతుకమ్మ : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలపై  రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్  గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నివాసిగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు కీలకమైన, వ్యూహాత్మక సమాచారాన్ని పంపాడు. మహేంద్ర ప్రసాద్ డీఆర్డీవో శాస్త్రవేత్తలు, భారత...