Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 5:48 pm Posted by : ramakrishna

చోరీకి గురైన ఆర్టీసీ బస్సు

 

జగిత్యాల, బతుకమ్మ :

 

జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ స్టాండ్ లో నిలిపి ఉంచిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు చోరికి గురైన సంఘటన జిల్లా లో కలకలం రేపింది. బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. అనంతరం బస్సును కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మెట్ పల్లి మండల శివారులో బస్సును అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. బస్సును తీసుకెళ్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.