Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 4:07 pm Posted by : ramakrishna

వన్డేలకు స్టీవ్ స్మిత్ వీడ్కోలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో 35 ఏళ్ల స్మిత్ అంతర్జాతీయ వన్డేలకు రిటైర్ మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే టీ20, టెస్టుల్లో కొనసాగుతానని వెల్లడించారు.  ఆస్ట్రేలియా తరపున 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగిడిన స్మిత్ ఇప్పటివరకు 170 వన్డేలు ఆడి..12 సెంచరీలు, 35 అర్ధసెంచరీలతో 5,800 పరుగులు చేశాడు. బౌలర్ గాను 28 వికెట్లు పడగొట్టాడు.