Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 6:06 pm Posted by : ramakrishna

వీధి శునకాలకు స్టిరలైజేషన్

 బతుకమ్మ, బోధన్:  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆనిమల్ బర్త్ కంట్రోల్ బృందం బోధన్ పట్టణంలో వీధి శునకాల నియంత్రణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకొని స్టిరలైజేషన్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడుతూ “పట్టణ ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా వీధి శునకాల నియంత్రణకు చర్యలు కొనసాగుతున్నాయి. స్టిరలైజేషన్ ద్వారా వీధి శునకాల సంఖ్య పెరగకుండా అరికట్టవచ్చు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు” అని తెలిపారు.