Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 7:41 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చర్యలు

 

. . .  పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ ఆలీలు ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్‌లో కొత్త కార్యాలయం నిర్మాణం పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకువస్తుందని, కార్యకర్తల సమన్వయానికి ఇది కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు.

 

Steps taken to strengthen the Congress party

 

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పార్టీ బలపాటుకు కార్యాలయాల నిర్మాణం అవసరమని  నిజామాబాద్‌లో నిర్మించబడుతున్న ఈ భవనం కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజా పాలనలో పారదర్శకత  బాధ్యతాయుత సేవలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ  నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా కార్యాలయం నిర్మాణం జరగడం ద్వారా ప్రజలకు మరింత సమీపంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని ఈ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, సిటి కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర మైనింగ్ డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.