Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 8:37 pm Posted by : ramakrishna

వైట్ కాలర్ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలి

 

. . . అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లా లో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్,  బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై గురువారం సీనీ సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అరెవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్ ,  మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, నిజామాబాద్ ఇన్ చార్జి ఏ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్, ఆర్మూర్ ఏ.సి.పి వెంకటేశ్వర రెడ్డి, సి.టి.సి, ఏ.సి.పి రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్ బి సి.ఐ అంజయ్య, సి.ఐ లు, ఎస్సైలు ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Steps should be taken to prevent white-collar crimes