Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 7:06 pm Posted by : ramakrishna

రుణమాఫీ అమలుకు చర్యలు తీసుకోవాలి

  • ఏప్రిల్ 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు విజయవంతంగా పూర్తయ్యాయని నిజామాబాదులో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమంతరావు, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, మాజీ శాసనసభ్యులు ఉజ్జయిని యాదగిరిరావు లు అన్నారు. ఈ సందర్భంగా 109 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు అయింది. అధ్యక్షా ప్రధాన కార్యదర్శి తో పాటు 21 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షులుగా భాగం హేమంత రావు, ప్రధాన కార్యదర్శిగా పశ్యపద్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర పాలకులు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాల ముందు ఏప్రిల్ 8వ తారీఖున ధర్నాలు నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. మూడవరోజు మహాసభలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి  పశపద్మ లు మాట్లాడుతూ… నిజామాబాదులో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు గొప్పగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి మహాసభల వల్ల రైతు సమస్యలు చర్చించడంతోపాటు సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందన్నారు. రైతులు అభివృద్ది చెందాలంటే, రైతు శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సుధాకర్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏ ఐ ఎస్ ఎఫ్ రఘు రాం, వివిధ జిల్లాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.