Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 5:54 pm Posted by : ramakrishna

పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేల చర్యలు తీసుకోవాలి

 

. . . నామినేషన్ ల ప్రక్రియను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఆర్మూర్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతియుత వాతావరణంలో నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మూడో విడత నామినేషన్ల స్వీకరణ  ఆర్మూర్ డివిజన్ లో బుధవారం ప్రారంభం కాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం లోని నామినేషన్ ల ప్రక్రియను, పోలింగ్ జరుగనున్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.. అక్కడ ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న ఏర్పాట్లను పరిశీలించారు.

Steps should be taken to conduct Panchayat elections in a peaceful atmosphere.

 

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ప్రకారం పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గర 100  మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి ల ప్రకారం అన్ని మండలాల యందు పర్యవేక్షించడం జరుగుతున్నాయని, సమస్యాత్మకమైన, అతి సమస్యాత్మకమైన ను ఏర్పాటు చేసి వాటి ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు మరియు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ  పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు. కమిషనర్ వెంట ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ , ఆర్.ఓ డి. సర్సయ్య ఎ.ఆర్.ఓ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సుకన్య, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరా సిబ్బంది పాల్గొన్నారు.