Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2024, 4:43 pm Posted by : ramakrishna

నిజామాబాద్ నగర అభివృద్ధికి అడుగులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని 36, 43 వ డివిజన్ లో సీసీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతుకిరణ్ లు పాల్గొని భూమి పూజా చేశారు. అనంతరం  ఎమ్మెల్యే మాట్లాడుతు మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా నగరంలోని కంటేశ్వర్ బ్యాంకు కాలనీలో 10-లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని 36 వ డివిజన్ రావోజీ సంఘం స్కూల్ వద్ద మరియు 43వ డివిజన్ సుభాష్ నగర్ లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.  జనరల్ ఫండ్ కింద ప్రతి డివిజన్ కు రూ.10 లక్షలు మంజూరయ్యాయన్నారు. నగర అభివృద్ధి సుందరికరణకు తగిన నిధులు విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. గతంలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి కూడా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన పనులకై స్పెషల్ ఫండ్ 100 కోట్ల నిధులు మంజూరు చేయాలనీ వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణలో అన్ని నియోజకవర్గల అభివృద్ధికి కృషి చేయాలనీ పక్షపాతంగా కొడంగల్, ఖమ్మం, నల్గొండ కాకుండా నిజామాబాదు పైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు డివిజన్ కి మరో 10 లక్షలు విడుదల చేయాలనీ మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమం లో స్థానిక 36 వ డివిజన్ కార్పోరేటర్ మాస్టర్ శంకర్, 43 వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతి రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Steps for the development of Nizamabad city